Chudaramma Satulala Lyrics In English And Telugu

  Telugu


చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ|

కూడున్నది పతి చూడి కుడుత నాంచారి||


శ్రీమహాలక్ష్మియట సింగారాలకే మరుదు|

కాముని తల్లియట చక్కదనాలకే మరుదు||

సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు|

కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి||


కలశాబ్ధి కూతురట గంభీరలకే మరుదు|

తలపలోక మాతయట దయ మరి ఏమరుదు||

జలజనివాసినియట చల్లదనమేమరుదు|

కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి||


అమరవందితయట అట్టీ మహిమ ఏమరుదు|

అమౄతము చుట్టమట ఆనందాలకేమరుదు||

తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె|

కౌమెర వయస్సు ఈ చూడి కుడుత నాంచారి||

English


cUDaramma satulArA sObAna pADaramma |

kUDunnadi pati cUDi kuDuta nAMcAri||


SrImahAlakShmiyaTa siMgArAlakE marudu |

kAmuni talliyaTa cakkadanAlakE marudu||

sOmuni tObuTTuvaTa soMpukaLalakEmarudu |

kOmalAMgi I cUDi kuDuta nAMcAri ||


kalaSAbdhi kUturaTa gaMBIralakE marudu |

talapalOka mAtayaTa daya mari Emarudu||

jalajanivAsiniyaTa calladanamEmarudu |

koladimIra I cUDi kuDuta nAMcAri||


amaravaMditayaTa aTTI mahima Emarudu |

amRutamu cuTTamaTa AnaMdAlakEmarudu ||

tamitO SrIvEMkaTESu dAne vacci peMDlADe |

kaumera vayassu I cUDi kuDuta nAMcAri|


Comments